Sunday 24 February 2013

నివేదన..

దీపం కొండెక్కక ముందే
ఇల్లు సేరరా  అంటే
ఏడేడో తిరిగి వత్తావు...

వదులైన చోట బిగుతు
చూపుతావు
ఒంటరిదాన్నని
సులకన సేసి
ఏవేవో మాయ మాటలు
సెప్పి లొంగదీత్తావు...

ఇలా కుదరదని
మొరాయించినా
నీ మొరటు చేతుల
కరకు దనానికి
ఎందుకో కరిగిపోతుంటా...

నీ సేతిలోని నలిగిన
మల్లె సెండే నా సిగకు
అలంకారమైనా
నీ  మోటుదనం ఎనక
దాగిన మెత్తదనం
ఇలా కరిగిపోనిస్తోంది...

కాలం కరిగి
నా దేహాగ్ని
దహించి నన్ను
బూడిద
కానివ్వకముందే
అక్కున
సేర్చుకోరా...