Friday 14 December 2012

ఏడ దాచేదే సెల్లీ..

ఆ సుప్పనాతోడు 
సుక్కను కోసుకొచ్చి 
నీ నుదుట బొట్టెడతానని ఎల్లినాడే సెల్లీ...

సుక్క తేనేదు కానీ 
పూటుగా సుక్కేసుకొచ్చి 
ఇన్ని బొండు మల్లెలు తలలో తురిమినాడే సెల్లీ...

ఆ ఏటి నురగనంతా దోసిట పట్టి
నీ బుగ్గ నిమురుతానన్నాడే సెల్లీ...

నురగ తేనేదు కానీ 
కళ్ళలో ఎఱ జీరలతో ఎగబడ్డాడే సెల్లీ...

జిలేబీ  పొట్లం తెస్తానన్నాడే సెల్లీ
పొట్లం ఏదిరా అని సూత్తే
నీకన్నా జిలేబీ తీయగుంటదా అంటాడే సెల్లీ...

ఈ తాపమోపలేనే సెల్లీ...
ఈడినాపలేనే ఈడునాపుకోలేనే సెల్లీ...

వాడి  కోర మీసం 
మిట్ట పిల్లలా మిల మిలా మెరుస్తూ 
పెదవి సివర గుచ్చుతుంటే 
ఏడ దాగేదే సెల్లీ
ఏడ దాచేదే సెల్లీ...

బుల్ బుల్ పిట్టా బుల్లి పిట్టా అంటూ
గుబులు రేపుతుంటే ఏడ పోయేదే సెల్లీ...

దాసేత్తే దాగని మనసు 
ఇలా ఎగసి ఎగసి పడుతుంటే 
ఏటి ఒడ్డున పడ్డ సేపలాగున్నానే సెల్లీ...

Friday 16 November 2012

అమ్మో సలేసత్తంది...



సలి సలి 
సలి సలిగా ఒకటే కలవరింత
కాసింత ఎచ్చగా వుంటె ఎంత బావుణ్ణు

బావా!
ఎప్పుడూ ఆ దిక్కుమాలిన కీ బోర్డ్ వదలవా
ఇక్కడ ఒకటే ఇదిగా సలపతా వుంటె 
నీ వేలి సివర ఏడికి కాలిపోవాలని 
ఆత్రంగా వుంటే ఏటో నీ పాడుగోస...

ఏదొట్టుకుంటే అది వొగ్గీసి రావుకదా
సలి పులి కొరుక్కు తింటా వుందిరా సచ్చినోడా..

నీ మెడ దొరక పుచ్చుకొని 
నీ పై కాలేసుకొని ఎచ్చగా తొంగుంటానంటే
రాకుండా ఏటి సేత్తన్నావ్ రా దిక్కుమాలినోడా...

నా నోరసలే మంచిది కాదు
అటేడుతరాలు ఇటేడు తరాలు ఉతికారేయగలను...

అబ్బా సలి పులి....

Saturday 10 November 2012

కుమ్మేయగలను


ఎట్టా వున్నావోలమ్మీ...
ఎన్నాళ్ళయిందో నాలాంటి నీతో ఊసులాడి...
అట్టా సూడమాకు సూసే కొద్దీ కొరకబుద్దేస్తానంట...
ఈయన ఒక పట్టాన వదిలి సావడాయె...
ఏదో కట్టుకున్నోడుమల్లే యీ పట్టు యిడవడాయె....
నీకెవరేమన్నా సీపురు కట్ట తిరగేసి యిరగదీస్తానమ్మోలమ్మీ...
ఏం ఫికర్ సేయకు...నేనున్నా....
అబ్బా వుండరా బావా ఆ నడుము మడత కరగదీసేలాగున్నావు...

అమ్మి ముందు ఈ ఎక సెక్కాలేంటి....
తిరగేసి కుమ్మేయగలను...

వుండోలమ్మీ ఈడి సంగతి జూస్సి వస్తా...

ఈ లోపు ఫ్రెషయి రెడీగా వుండు...