Friday 16 November 2012

అమ్మో సలేసత్తంది...



సలి సలి 
సలి సలిగా ఒకటే కలవరింత
కాసింత ఎచ్చగా వుంటె ఎంత బావుణ్ణు

బావా!
ఎప్పుడూ ఆ దిక్కుమాలిన కీ బోర్డ్ వదలవా
ఇక్కడ ఒకటే ఇదిగా సలపతా వుంటె 
నీ వేలి సివర ఏడికి కాలిపోవాలని 
ఆత్రంగా వుంటే ఏటో నీ పాడుగోస...

ఏదొట్టుకుంటే అది వొగ్గీసి రావుకదా
సలి పులి కొరుక్కు తింటా వుందిరా సచ్చినోడా..

నీ మెడ దొరక పుచ్చుకొని 
నీ పై కాలేసుకొని ఎచ్చగా తొంగుంటానంటే
రాకుండా ఏటి సేత్తన్నావ్ రా దిక్కుమాలినోడా...

నా నోరసలే మంచిది కాదు
అటేడుతరాలు ఇటేడు తరాలు ఉతికారేయగలను...

అబ్బా సలి పులి....

10 comments:

  1. అమ్మోలమ్మో....సరసం తెలిసిన సీకాకులం సిత్రాంగివే:-)
    కూసింత సిగ్గుపడితే ఇంకా బాగుండేదేమో ఈ....కలవరం!

    ReplyDelete
    Replies
    1. అలగే పద్మప్పా.. అయినా సిగ్గు పడితే సిక్కదు కదా..:-)
      thank you..

      Delete
  2. ఒట్టి సరసాలేనా? నవరసాలేమైనా కాస్త .........

    ReplyDelete
    Replies
    1. వినోద్ బావ్..ఇదిగిదిగో ఇప్పుడిప్పుడే అడుగులేత్తున్నా కదా.. ఒక్కో మెట్టు అలా..
      ధన్యవాదాలండీ..

      Delete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. సీకాకులంలోనే అంత సల్లంగుంటే మరి మా హైదరాబాద్లా ఎట్లుండాలె జరజెప్పు:-)

    ReplyDelete
    Replies
    1. అమ్మీ సికాకుళం ఏజెన్సీ సలి దెబ్బ తెలీదునాగుంది నీకు...
      ఓ పాలి ఇటువైపొచ్చి సూసెలితే తెలుత్తాది..
      మా ఇంటికి రారాదా...
      నాటుకోడి కూరతో మా రంజుగా తినేసి కబుర్లాడుకుందాం..:-)

      Delete
  5. ఏంచెప్పాలో తెలియడంలేదు...ఏమన్నా ఓలమ్మోలమ్మో అని అంటే:)

    ReplyDelete
  6. chaala bagundi.. sikaakulam sitrangive nuv...

    ReplyDelete