Wednesday 29 January 2014

రాతిరి శివరాతిరి...



సలికాలం సివరాకరుకు వచ్చేత్తున్నా
నా మావ అలికిడి లేదాయే...

కుంపటిలా ఒళ్ళంతా మరిగిపోతున్నా
నా మావ జాడ లేదాయే...

గుండెల్లో గుబులు రేగుతున్నా
నా మావ సవ్వడి వినబడదాయే...

ఏ  చూరు కింద నక్కినాడో 
నా మాయదారి సిన్నోడు నా మనసే లాగేత్తున్నాడే...

లగ్గమొద్దురా మావా రారా అని నోరారా
తనివితీరా పిలిస్తే ఆగే అంటాడే...

సంకురాతిరి పోయి శివరాతిరి 
వస్తున్నా రావేందిరా మావా....

సంపెంగ పూలు వాడిపోనాయి
మల్లె మొగ్గలు వేళ మురిపాలతోడ రారా...

Sunday 27 October 2013

నులక మంచం..


ఏటి ఒడ్డున మా ఊరు 
ఏటి మద్దెన మా బావుండు

కేకేస్తే  సేపలు కూరకు లోటేనేదు
సప్పుడు సేత్తే కల్లు ముంతకు తిరుగేనేదు

నువు ముట్టుకుంటే జువ్వు మంటాది బావా
నువు రాక ఈ ఏటి పాయ మింగ సూత్తోంది రావా

ఎన్నెల  రాతిరంతా ఈ నులక మంచం కిఱుమనక 
ఏప సెట్టు దిగాలుగా ఆకులు రాలుస్తోంది బావా

ఆ బంతి పూవు కోసి ఈ కనకాంబరం ఏరుకొని
నా సిగలో తురిమి దీపావళి తారాలా దూసుకుపోవా

 

Thursday 19 September 2013

నెగడు...

 
ఎప్పుడో ఒక ఈల వేస్తూ 
ఒక వీచీ  వీయని సమీరంలా 
నన్నల్లుకు పోయే నా దొరా

నీ కోసం ఎన్ని వసంతాలు
ఎన్ని వాన రాత్రులు
ఎన్నెన్ని చలి నెగడులు 
మద్య వేచి వుండను

కాసింతయినా 
కనికరం లేని 
మనిసివాయె
తిడదామన్నా 
మనసు రాదాయె

యింక ఈ ఏల కాని ఏల
వొదిలి నేనాగలేను దొరా
కాసింత కారంగా 
గారంగా ఎదకు 
చేరువగా పలుక రావా!!

Tuesday 6 August 2013

చలి కుంపటి...


కురుస్తున్న 
వాన
ఇలా 
గుండెల్లోతుల్లోకి
ఇంకుతూ 
నీ మీద 
ఆశ 
పొంగి పొర్లుతూ
నా మనసు 
ఇలా 
కాగితప్పడవలా
మారి 
నీ జ్నాపకాల
ఏటిలోకి 
జారిపోతూ
నీలోకి 
అలా
ఇగిరిపోతూ

వద్దన్నా
చాస్తున్న 
చేతులు
నా మాట
వినడం
లేదేమబ్బా

రావయ్యా
ఈ వర్షాతిరేకంలో
నీ తడిచిన 
పాదాలను
నా పెదాలతో
తాకుతూ
వత్తనీ

నీ చేయి 
అలా 
నా పాపిట
సర్దుతూ 
మెడవెనక
నిమురుతూ
నన్నిలా 
చలి కుంపటి 
చేయనీ...

Thursday 25 April 2013

మల్లెల వేళ...


ఈ ఉక్కపోతకు ఒంటిమీద పైటే నిలవలేకుందిరా  అంటే 
అలా సందిట పట్టి గుంజుకుంటావేందిరా మా(వా...

గాలి ఆడక ఉక్క ఉక్కిరి బిక్కిరి సేత్తే
నీ ఊపిరి ఊది ఏడెక్కిత్తావేందిరా మా(వా...

కర్తరీ ఎండలు మండుతూ
మరగ బెడుతుంటే దోసెడు మల్లెలు పోసి 
మత్తుగా జూత్తే నేనెట్టా ఆగేదిరా మా(వా...

తాపం తాళ లేక కోనేరులో మునక వేస్తే
తడి సీర గుట్టునంతా రట్టు జేస్సి
సుట్టుకు పోతానని మారామేందిరా మా(వా...

కాసేపలా గాలి పడదామని డాబా ఎక్కితే 
అక్కడా కొబ్బరాకుల ఎన్నెల నీడల 
మాటున సల్లగ అల్లుకు పోతావేందిరా మా(వా....

నీ ఊపిరాడనీయని సరసానికి
ఈ ఏసవి ఏడి కొండెక్కి పోయిందిరా మా(వా..

Sunday 24 February 2013

నివేదన..

దీపం కొండెక్కక ముందే
ఇల్లు సేరరా  అంటే
ఏడేడో తిరిగి వత్తావు...

వదులైన చోట బిగుతు
చూపుతావు
ఒంటరిదాన్నని
సులకన సేసి
ఏవేవో మాయ మాటలు
సెప్పి లొంగదీత్తావు...

ఇలా కుదరదని
మొరాయించినా
నీ మొరటు చేతుల
కరకు దనానికి
ఎందుకో కరిగిపోతుంటా...

నీ సేతిలోని నలిగిన
మల్లె సెండే నా సిగకు
అలంకారమైనా
నీ  మోటుదనం ఎనక
దాగిన మెత్తదనం
ఇలా కరిగిపోనిస్తోంది...

కాలం కరిగి
నా దేహాగ్ని
దహించి నన్ను
బూడిద
కానివ్వకముందే
అక్కున
సేర్చుకోరా...

Wednesday 23 January 2013

దాహపు శాపం...

ఈ  సలి రాతిరి
నన్నొంటరిజేసి
ఈ తడిక మాటున
వీడిపోకుమా...

నీ తడి అంటిన
పెదవి తాపంతో
తహ తహలాడుతోంది..

నీ పంటి గాటు
పడిన చోట
తీయని మంట
కాగుతోంది...

అందీ అందకుండా
ఊరించానని
నన్ను ఈ దాహపు
శాపానికి గురిచేయకు...