Sunday 27 October 2013

నులక మంచం..


ఏటి ఒడ్డున మా ఊరు 
ఏటి మద్దెన మా బావుండు

కేకేస్తే  సేపలు కూరకు లోటేనేదు
సప్పుడు సేత్తే కల్లు ముంతకు తిరుగేనేదు

నువు ముట్టుకుంటే జువ్వు మంటాది బావా
నువు రాక ఈ ఏటి పాయ మింగ సూత్తోంది రావా

ఎన్నెల  రాతిరంతా ఈ నులక మంచం కిఱుమనక 
ఏప సెట్టు దిగాలుగా ఆకులు రాలుస్తోంది బావా

ఆ బంతి పూవు కోసి ఈ కనకాంబరం ఏరుకొని
నా సిగలో తురిమి దీపావళి తారాలా దూసుకుపోవా

 

4 comments:

  1. పిచ్చిమొద్దు ఒట్టి తారాజువ్వలా దూసుకుపొమ్మంటే ఎట్టా? కాకరపువ్వొత్తులు, అటంబాంబులు అట్టుకురమ్మను:-)

    ReplyDelete
  2. అందరికీ ప్రేమాభివందనాలు..<౩

    ReplyDelete