Thursday 19 September 2013

నెగడు...

 
ఎప్పుడో ఒక ఈల వేస్తూ 
ఒక వీచీ  వీయని సమీరంలా 
నన్నల్లుకు పోయే నా దొరా

నీ కోసం ఎన్ని వసంతాలు
ఎన్ని వాన రాత్రులు
ఎన్నెన్ని చలి నెగడులు 
మద్య వేచి వుండను

కాసింతయినా 
కనికరం లేని 
మనిసివాయె
తిడదామన్నా 
మనసు రాదాయె

యింక ఈ ఏల కాని ఏల
వొదిలి నేనాగలేను దొరా
కాసింత కారంగా 
గారంగా ఎదకు 
చేరువగా పలుక రావా!!

4 comments:

  1. లగ్గెత్తుకొచ్చేలా పిలిచావుకదేటి ఓలమ్మో :-)
    చాలా చాలా బాగుంది భావం.

    ReplyDelete
  2. ఏతయిపోయావ్ ఓలమ్మోలమ్మో, శానా ఏళ్ళలాగుంది..
    చాలా బాగుందండి మీ ఈ కవిత

    శ్రీధర్ భుక్య
    కావ్యాంజలి బ్లాగ్
    http://kaavyaanjali.blogspot.in/

    ReplyDelete