Tuesday 6 August 2013

చలి కుంపటి...


కురుస్తున్న 
వాన
ఇలా 
గుండెల్లోతుల్లోకి
ఇంకుతూ 
నీ మీద 
ఆశ 
పొంగి పొర్లుతూ
నా మనసు 
ఇలా 
కాగితప్పడవలా
మారి 
నీ జ్నాపకాల
ఏటిలోకి 
జారిపోతూ
నీలోకి 
అలా
ఇగిరిపోతూ

వద్దన్నా
చాస్తున్న 
చేతులు
నా మాట
వినడం
లేదేమబ్బా

రావయ్యా
ఈ వర్షాతిరేకంలో
నీ తడిచిన 
పాదాలను
నా పెదాలతో
తాకుతూ
వత్తనీ

నీ చేయి 
అలా 
నా పాపిట
సర్దుతూ 
మెడవెనక
నిమురుతూ
నన్నిలా 
చలి కుంపటి 
చేయనీ...

5 comments:

  1. ఒక అందమైన కవిత

    ReplyDelete
  2. థాంక్సండీ మహిది అలి సాబ్,
    శంకర బాబు గారు..

    ReplyDelete
  3. ఒలమ్మొలమ్మొ రాదేయ గోరు శాన మంసి కవిత రాసినాలు ముచటగా ఉన్నది ఒయమ్మి
    సిక్కోలు యాసలా తొలిసారి రాసినా ఒయమ్మి. మీ సిక్కోలు కి అప్పుడప్పుడు నే వత్త ఉంటా.
    మీ బ్లాగ్ కు యాదృచికంగా వచ్చ. భలేగా రాస్తారు మీరు. చాల బాగుంది.

    మీ బ్లాగ్ టైటిల్ కి ఇన్స్పైర్ అయ్యి ఓ కైత రాసినా... నా బ్లాగ్ ని వీలుంటే 29-08-2013 న వీక్షించండి రాధేయ గారు.

    http://kaavyaanjali.blogspot.in/
    Regards,
    Sridhar Bukya​​

    ReplyDelete
  4. ఇప్పుడే చూసాను భలే రాస్తావోలమ్మి .

    ReplyDelete