Thursday 25 April 2013

మల్లెల వేళ...


ఈ ఉక్కపోతకు ఒంటిమీద పైటే నిలవలేకుందిరా  అంటే 
అలా సందిట పట్టి గుంజుకుంటావేందిరా మా(వా...

గాలి ఆడక ఉక్క ఉక్కిరి బిక్కిరి సేత్తే
నీ ఊపిరి ఊది ఏడెక్కిత్తావేందిరా మా(వా...

కర్తరీ ఎండలు మండుతూ
మరగ బెడుతుంటే దోసెడు మల్లెలు పోసి 
మత్తుగా జూత్తే నేనెట్టా ఆగేదిరా మా(వా...

తాపం తాళ లేక కోనేరులో మునక వేస్తే
తడి సీర గుట్టునంతా రట్టు జేస్సి
సుట్టుకు పోతానని మారామేందిరా మా(వా...

కాసేపలా గాలి పడదామని డాబా ఎక్కితే 
అక్కడా కొబ్బరాకుల ఎన్నెల నీడల 
మాటున సల్లగ అల్లుకు పోతావేందిరా మా(వా....

నీ ఊపిరాడనీయని సరసానికి
ఈ ఏసవి ఏడి కొండెక్కి పోయిందిరా మా(వా..

4 comments:

  1. ఏడినంతా చల్లబరిచే సత్తా ఉందిలే ఓలమ్మో మీలో:)

    ReplyDelete
    Replies
    1. అనికేత్ గారూ మీరలా తడికసాటునుండి సూత్తుంటే ఏడెక్కదా సెప్పండి...:-)

      Delete
  2. మల్లెలేళ ఈ ఏడి సల్లాపమేందో???
    మాసెడ్డ కష్టమొచ్చేసినాదిగందా ఓలమ్మోలమ్మో:-)

    ReplyDelete
    Replies
    1. పద్దక్కా నీకు తెలీని కట్టమా ఇది...:-)

      Delete