Wednesday 29 January 2014

రాతిరి శివరాతిరి...



సలికాలం సివరాకరుకు వచ్చేత్తున్నా
నా మావ అలికిడి లేదాయే...

కుంపటిలా ఒళ్ళంతా మరిగిపోతున్నా
నా మావ జాడ లేదాయే...

గుండెల్లో గుబులు రేగుతున్నా
నా మావ సవ్వడి వినబడదాయే...

ఏ  చూరు కింద నక్కినాడో 
నా మాయదారి సిన్నోడు నా మనసే లాగేత్తున్నాడే...

లగ్గమొద్దురా మావా రారా అని నోరారా
తనివితీరా పిలిస్తే ఆగే అంటాడే...

సంకురాతిరి పోయి శివరాతిరి 
వస్తున్నా రావేందిరా మావా....

సంపెంగ పూలు వాడిపోనాయి
మల్లె మొగ్గలు వేళ మురిపాలతోడ రారా...

5 comments:

  1. మల్లెమొగ్గల కోసం వెతుకుతున్నట్లున్నాడు అందుకే కామోసు కిమ్మనకున్నాడు :-)

    ReplyDelete
  2. ఈ విరహతాపానికి మూరెడు మల్లెలేం సరిపోతాయి మోపులు మోపులు కావాలి















    ReplyDelete
  3. Chaalaa baagundi.allukunna mallela lanti padalu inka baaginnayi:-):-)

    ReplyDelete
  4. Mallela Vela Ani Chakkani Nishsiraatiri Varnana Ichcharu.. Mee padaalu amogham.

    ReplyDelete
  5. ఒలమ్మొలమ్మో సికాకులం యాస తోటి మాంచి కైతలు రాసి ఈ పొద్దు యేడకెళ్ళినవ్..
    దాదాపు రెండేళ్ళు పూర్తిగావచ్చినాదిగందా..
    సక్కగా కవిత ఒకటో రెండో రాసేయోలమ్మోలమ్మో

    ReplyDelete