Friday 14 December 2012

ఏడ దాచేదే సెల్లీ..

ఆ సుప్పనాతోడు 
సుక్కను కోసుకొచ్చి 
నీ నుదుట బొట్టెడతానని ఎల్లినాడే సెల్లీ...

సుక్క తేనేదు కానీ 
పూటుగా సుక్కేసుకొచ్చి 
ఇన్ని బొండు మల్లెలు తలలో తురిమినాడే సెల్లీ...

ఆ ఏటి నురగనంతా దోసిట పట్టి
నీ బుగ్గ నిమురుతానన్నాడే సెల్లీ...

నురగ తేనేదు కానీ 
కళ్ళలో ఎఱ జీరలతో ఎగబడ్డాడే సెల్లీ...

జిలేబీ  పొట్లం తెస్తానన్నాడే సెల్లీ
పొట్లం ఏదిరా అని సూత్తే
నీకన్నా జిలేబీ తీయగుంటదా అంటాడే సెల్లీ...

ఈ తాపమోపలేనే సెల్లీ...
ఈడినాపలేనే ఈడునాపుకోలేనే సెల్లీ...

వాడి  కోర మీసం 
మిట్ట పిల్లలా మిల మిలా మెరుస్తూ 
పెదవి సివర గుచ్చుతుంటే 
ఏడ దాగేదే సెల్లీ
ఏడ దాచేదే సెల్లీ...

బుల్ బుల్ పిట్టా బుల్లి పిట్టా అంటూ
గుబులు రేపుతుంటే ఏడ పోయేదే సెల్లీ...

దాసేత్తే దాగని మనసు 
ఇలా ఎగసి ఎగసి పడుతుంటే 
ఏటి ఒడ్డున పడ్డ సేపలాగున్నానే సెల్లీ...

10 comments:

  1. సుక్కేసుకున్నా సూదంటురాయోడేనక్కా:-)

    ReplyDelete
    Replies
    1. అంతేనంటావా సెల్లీ..
      ఈ సంగతి నీకెలా ఎరుకయ్యినాదో మరి..
      నాకు మా సెడ్డనుమానుగుంది..:-)

      Delete
  2. నీ పైనే పాణమన్న సంగతి సెప్పకనే సెప్పినాడుగదేటి
    సెంగున గట్టేసుకుని సరసమాడలేదంటే ఎలాగోలమ్మి:-)

    ReplyDelete
    Replies
    1. దానికేం తక్కువ సెయ్యడక్కా...
      అటూ ఇటూ తూలుతాడనే నా బెంగ..:-)
      ధన్యవాదాలు పద్దక్కా..

      Delete
  3. Replies
    1. మీ ఈ మాట సానా బాగుందండీ శృతిరుద్రాక్ష్ గారు...ధన్యవాదాలు..

      Delete
  4. ఈ బ్లాగ్ ఆడవాళ్ళకి మాత్రమే కాదుకదండి.
    కాకపోతే కామెంట్ స్వీకరించండి లేదా డెలిట్
    "భాషలోని యాసేదైనా భావం బాగుందండి"

    ReplyDelete
    Replies
    1. బ్లాగులో నేనెక్కడా ఆ మాట సెప్పనేదు కదేటి Yohanth గారు..:-)
      మీరు మెచ్చుకున్నారంటే సగం పాసయ్యానన్నట్టే..
      యాస పుట్టుకతో వచ్చింది పోదుకదా బావ్...ధన్యవాదాలు..

      Delete
  5. వాడి కోర మీసం
    మిట్ట పిల్లలా మిల మిలా మెరుస్తూ
    పెదవి సివర గుచ్చుతుంటే
    ఏడ దాగేదే సెల్లీ
    ఏడ దాచేదే సెల్లీ...

    సానా బాగుందోలమ్మీ...కుమ్మేత్తన్నావు మన యాసలో...

    ReplyDelete
  6. సాలా సాలా బాగుందండి మీ సుప్పనతోడి ఎవ్వారం...కళ్ళలో ఎర్ర జీరలు -జేబులో జిలేబి పొట్లం..కోర మీసాలు... బుల్ బుల్ పిట్ట ..ఇలాంటివి అన్ని విని చాల రోజులయ్యింది ..బాగుంది మీ యాస .బాస ..కవిత కూడా

    ReplyDelete